‘నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వెయ్యొచ్చుగా బావా’ అని నటి శ్రీరెడ్డి తన ట్విటర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విన్నవించుకుంది.
ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న శ్రీరెడ్డి తాజాగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహిపై ట్వీట్ చేసింది.
వారు వీరు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినీ పరిశ్రమకు చెందిన అందరిపై నోరు పారేసుకుంటూ శ్రీరెడ్డి పాపులరైంది. ఎప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతుందో అర్థం కానటువంటి రీతిలో వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి ట్వీట్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ట్వీట్ శ్రీరెడ్డి ఖాతానుంచే వచ్చిందా? లేదంటే ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.