ప్రభాస్ నటించిన సలార్ సినిమా(Salaar) కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సలార్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్‌ను పొందుతుంది ఈ సినిమా. ఒక చిన్న టీజర్ రెండు రోజుల పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది.
KGF దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించినందున, సలార్ ‘మిస్‌ఫైర్’ అయ్యే అవకాశాల గురించి ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందడం లేదు. అలాగే ఈ చిత్రం బిజెనెస్ కూడా బాగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. నిర్మాతలు కూడా దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సలార్ సినిమా మేకర్స్ హోంబళే ఫిలిమ్స్.. ఏపీ, తెలంగాణ నుంచి 200 కోట్ల రూపాయలను లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే ప్రభాస్(Prabhas) గత మూడు చిత్రాలను చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఇంత ఎక్కువ ధరలకు సైన్ ఇన్ చేయడానికి వెనుకాడుతున్నారు. సినిమా అంచనాలను అందుకోలేక పోయినా లేదా పూర్తిగా మిస్ ఫైర్ అయినట్లయితే భారీ మొత్తంలో నష్టపోతామని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.
డిస్ట్రిబ్యూటర్ల సందేహాలతో నిర్మాతలు ఆలోచనల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. కమీషన్ ప్రాతిపదికన సొంతంగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నిర్మాతలు సలార్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని, ఇది మినిమం గ్యారెంటీ సినిమా అని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేయబోతుందని నమ్ముతున్నారు. తమ సొంతంగా విడుదల చేసి మరింత వసూళ్లు సాధించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సలార్‌ని తెలంగాణలో నిర్మాతల ధరకు అమ్ముతారని, అయితే ఏపీలో మాత్రం నేరుగా విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.