పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ బాద్ షా చిత్రం విడుదలకు దగ్గరగా ఉంది.
ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయని చర్చ జరుగుతోంది.
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar Part 1). టీజర్ జూలై 6న విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఇటు ప్రభాస్, అటు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సహజంగానే వీరిద్దరి కాంబినేషన్ అనడంతో హైప్ క్రియేట్ అయింది. బాహుబలి తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్… మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే పెద్ద బ్రేక్ కావాల్సి ఉంది. సలార్‌తో ప్రభాస్(Prabhas) ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాడని భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు(Salaar OTT Rights) ఇప్పటికే అమ్ముడయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంత చేసుకుందని టాక్. భారీ మొత్తంలో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ ఇదే రికార్డు. OTT హక్కులను పొందిందనే దాని గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, అమెజాన్ ప్రైమ్ వీడియో సలార్ కొనుగోలు చేసిందని బజ్ ఉంది.
షారుఖ్ ఖాన్ జవాన్(Shah Rukh Khan Jawan) OTT హక్కులు కూడా అమ్ముడయ్యాయి. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిసారిగా నటిస్తున్న చిత్రం. దీంతో ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయింది. కొంతమంది చెబుతున్న లెక్కల ప్రకారం షారుఖ్ జవాన్ సినిమను 90 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. దీంతో షారుఖ్ ఖాన్ జవాన్‌ను ప్రశాంత్ నీల్-ప్రభాస్ సలార్‌తో పోల్చడం ప్రారంభించారు. దీనికి సంబంధించి చాలా ట్వీట్లు చేస్తున్నారు.
ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2(KGF 2), సలార్ సినిమాకు కనెక్షన్ ఉందని చెబుతున్నారు. ఇందులో శృతి హాసన్, రామచంద్రరాజు, మధు గురుస్వామి, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, తిను ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి పూర్తి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సమకూరుస్తుండగా, భువన్ గౌడ కెమెరా వర్క్ చేశారు. 200 కోట్ల బడ్జెట్‌తో హోంబలే ఫిలింస్ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
జవాన్ సినిమా(Jawan Cinema) ఈ ఏడాది సెప్టెంబర్ 7న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నయనతార, ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. జికె విష్ణు కెమెరా వర్క్ చేయగా, రూబెన్ ఎడిటర్‌గా పనిచేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.