ఒక తెలుగు సినిమా హీరో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎంపికవ్వడం అంటే అంతకుమించిన క్రెడిట్ లేదు. ఇన్నాళ్లు కేవలం హిందీ సినిమాలు, హీరోలకు మాత్రమే ఈ ఘనత దక్కేది.
వారికే అగ్రతాంబూలం ఉండేది. కానీ మన తెలుగు సినిమా సత్తా చాటింది.
అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇలా నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తంగా 11 నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాకు దక్కాయి. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో తెలుగు సినిమా అవార్డులు సొంతం చేసుకోలేదు. నేడు తెలుగు సినిమాకు ప్రౌడ్ మూమెంట్ అనడంలో సందేహం లేదు.
2021 డిసెంబర్ లో పుష్ప చిత్రం విడుదలైంది. ఇది పీరియాడిక్ క్రైమ్ డ్రామా. పుష్పరాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ నటించారు. పుష్ప ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా హిందీలో ఊహించని విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేనరిజమ్స్ ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యాయి.
పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ కు ప్రకటించగానే ఆ సంతోషాన్ని చిత్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇద్దరూ చాలా సేపు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుకుమార్ అయితే ఏడ్చేశాడు. బన్నీ కూడా ఏమోషనల్ అయ్యారు. చిత్రం యూనిట్ విషెస్ చెప్పుకుంటూ ఆనందంతో ఉప్పొంగిపోయారు.
అవార్డ్ వచ్చిన సంతోషంలో నిర్మాత నవీన్ తోపాటు చిత్రం యూనిట్ సంబరాలు చేసుకున్నారు. అల్లు అరవింద్ అందరినీ హత్తుకొని బెస్ట్ విషెస్ తెలిపారు.