CINEMA

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ఆ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. అక్కడ 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్ నమోదు చేయక పోవడంతో నిర్మాత దిల్ రాజు తీవ్ర సంతృప్తి తో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. తెలుగులో మినిమమ్ గా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని వారసుడు సినిమాకు దిల్ రాజు ఆశించాడట.

దిల్ రాజు ఆశించిన కలెక్షన్స్ లో నాలుగవ వంతు కూడా దిల్ రాజు ఖాతాలో పడలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. భారీ ఎత్తున తెలుగు లో విడుదల చేయాలని ప్లాన్ చేసిన దిల్ రాజుకి చివరి నిమిషంలో షాక్ తగిలింది. తమిళంలో విడుదలైన తర్వాత మూడు రోజులకు తెలుగులో విడుదల చేయాల్సి వచ్చింది. తెలుగులో పెద్ద హీరోలకు పోటీగా విడుదల అవ్వడంతో తమిళనాడు సక్సెస్ అయినా కూడా దిల్ రాజు సొంత గడ్డ అయిన తెలుగు రాష్ట్రాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి దిల్ రాజు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సింది పోయి… రచ్చ గెలిచి ఇంట ఓడి పోయాడు అంటూ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.