CINEMA

పూజా హెగ్డే ఆస్తుల విలువ అన్ని కోట్లా.. స్టార్ హీరోలు కూడా దిగదుడుపే!?

ముంబై నుంచి దిగుమతి అయిన ముద్దుగుమ్మల్లో పూజా హెగ్డే ఒకటి. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా వచ్చిన `ఒక లైలా కోసం` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూజా హెగ్డేకి.. `డీజే: దువ్వాడ జగన్నాధం` మూవీతో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మన బుట్టబొమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది.

స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా నిలిచింది. అయితే గత కొంతకాలం నుంచి పూజా హెగ్డే కెరీర్ అంతా సానుకూలంగా సాగడం లేదు. ఈ అమ్మడు సరైన హిట్టు అందుకునే దాదాపు ఏడాది కావస్తోంది. రాధేశ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర ఇటీవల విడుదలైన `కిసీ కా భాయ్ కిసీ కి జాన్`(Kisi Ka Bhai Kisi Ki Jaan) వరకు కొనసాగుతూనే ఉంది. కొందరు అయితే ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా కూడా ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu)కి జోడిగా `ఎస్ఎస్ఎబ్‌బీ 28` లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఓ మూవీకి కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే దాదాపు దశాబ్దం కాలం నుంచి సినీ పరిశ్రమలో కొనసాగుతున్న పూజా హెగ్డే.. ఆస్తులను గట్టిగానే కూడబెట్టింది. ఆస్తుల విషయంలో కొందరు స్టార్ హీరోలు కూడా పూజా హెగ్డే ముందు దిగదుడుపే. ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న పూజా హెగ్డేకు ముంబైలోని ఖరీదైన ఏరియా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ సముద్ర తీరంలో త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ కొన్న కోట్లలో ఉంటుంది. పూజా హెగ్డే ఫ్యామిలీతో కలిసి ఈ అపార్ట్మెంట్ లోనే ఉంటుంది.

అలాగే ముంబై, హైదరాబాద్ నగరాల్లో పూజా హెగ్డే(Pooja Hegde) కొన్ని ఫ్లాట్స్ ను కొనుగోలు చేసింది. పూజా హెడ్డే తండ్రి మంజునాధ్ హెగ్డే బడా వ్యాపార వేత్త. అలాగే తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న మెళుకువలతో పూజా హెగ్డే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇక పూజా గ్యారేజ్ లో కొన్ని కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు సేద తీరుతున్నాయి. మొత్తంగా పూజా హెగ్డే ఆస్తుల విలువ రూ. 60 కోట్లు ఉంటుందని పలు నివేధికలు చెబుతున్నాయి.