CINEMA

ఆ స్టార్ హీరోల వల్ల కృష్ణ కొడుకు అంత నరకం చూశారా..?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు ప్రముఖ హీరో దివంగత నటుడు రమేష్ బాబు (Rameshbabu)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రమేష్ బాబు అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఇండస్ట్రీ నుంచి దూరం కావడం జరిగింది. ఆ తర్వాత నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించారు. ఇదిలా ఉండగా రమేష్ బాబు ఆ స్టార్ హీరోల వల్ల నరకం చూశారు అని సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు.. రమేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు (Adhi sheshagirirao) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హాజరై రమేష్ బాబు సినీ కెరియర్ లో పడ్డ కష్టాలు అవమానాల గురించి వెల్లడించారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభివృద్ధి పనులు ఎక్కడా కూడా ఎక్కువగా జరగడం లేదు అని.. కృష్ణ గారు తనతో చెప్పారు అని ఆదిశేషగిరిరావు మీడియాతో వెల్లడించారు.. ఇకపోతే రమేష్ బాబు గురించి మాట్లాడుతూ.. రమేష్ బాబు నటించిన చాలా సినిమాల్లో ఎన్నో హిట్లు ఉన్నాయి.. అయితే అలా ఎన్ని హిట్లు ఉన్నా సరే బాలకృష్ణ , వెంకటేష్ లాగా తాను కూడా ఎదగలేకపోయానని.. రమేష్ బాబుకు ఎప్పుడు బాధ ఉండేది అప్పుడు కొన్నాళ్లు నరకం అనుభవించాడు.

ఇక ఆ బాధనే భరిస్తూ ఎన్నో ఏళ్ళు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.. ఇక చివరిగా గత ఏడాది జనవరిలో గుండెపోటు వచ్చి మరణించాడు అంటూ ఆది శేషగిరిరావు వెల్లడించారు.. మంజుల సినీ ఇండస్ట్రీకి రాకపోవడానికి గల కారణాన్ని కూడా ఆయన తాజాగా వెల్లడించడం జరిగింది. సౌత్ ఇండస్ట్రీలో సినీ కుటుంబం నుంచి ఆడవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తే ప్రేక్షకులు నుంచి తప్పక వ్యతిరేకత ఉంటుంది. అందుకే మంజుల ఇండస్ట్రీ వైపు అడుగులు వేయలేదు కానీ తెలిపాడు.

ఇకపోతే మంచి లుక్, హీరో కటౌట్ , ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా రమేష్ బాబుకు మాత్రం కాలం కలిసి రాక ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాడని చెప్పవచ్చు.