CINEMA

57 ఏళ్ల వయస్సులో Salman Khan పెళ్లి..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నాడా.. నిజమా.. అంటే సగం నిజం.. సగం అబద్దం. పెళ్లి చేసుకోవడం నిజమే.. కానీ రియల్ గా కాదు రీల్ లో.

అవును సల్మాన్.. కొత్తగా ఒక లవ్ స్టోరీని చేయనున్నాడట. పాపులర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అంతేకాదు ఈ సినిమాకు ప్రేమ్ కు షాదీ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ప్రేమ్ అనే పేరు సల్మాన్ కు ఎంతగా కలిసి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మూడేళ్ళ క్రితమే ఈ కథను దర్శకుడు సల్మాన్ కు వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగాయట. అయితే కొన్ని కారణాల వలన ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అంట. సల్మాన్.. లవ్ స్టోరీస్ అంటే పర్ఫెక్ట్ కాంబో.

ఇప్పటివరకు సల్లు భాయ్ నటించిన లవ్ స్టోరీస్ కానీ, కుటుంబ కథా చిత్రాలు కానీ, ప్లాప్ కాలేదు. దీంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలానే పెట్టుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన పేరు వినిపిస్తోంది. దీపికా, ప్రియాంక, కత్రీనా అంటూ చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరూ కూడా సల్మాన్ తో నటించనవారే. దీంతో వీరినే తీసుకుంటారా..? లేక టాలీవుడ్ లో వెతుకుతారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు 57 ఏళ్ళ వయస్సులో పెళ్లి కహానీ ఏందయ్యా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.