CINEMANational

రజినీకాంత్ కితాబు, అమెరికా ఇంజినీర్ల ప్రశంసలు: తెలంగాణ నెంబర్ 1 అంటూ కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యద్భుతంగా పురోగతి సాధించిందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.

పర్యావరణం, పరిశ్రమల రంగాల్లో అద్భుతమైన ప్రగతి జరిగిందన్నారు.

తెలంగాణలో సమగ్ర, సమత్యులత,సమ్మిళిత అభివృద్ధి జరిగిందని వివరించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండీస్ట్రియల్ పార్క్‌లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.

 

పరిశ్రమల ఏర్పాటు లో అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ విధానంలో 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కూడా ఇలాంటి విధానం లేదు అని అక్కడి పారిశ్రామిక వేత్తలు చెప్పారు.