CINEMA

స్టార్ హీరోలతో తెరకెక్కబోతున్న పొలిమేర 3 మూవీ.

మా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు..

ఈ చిత్రంలో సత్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను మరియు అక్షత శ్రీనివాస్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.మా ఊరి పొలిమేర చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చిన నిర్మాతలు దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మా ఊరి పొలిమేర 2 సినిమాను మాత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మొదటి పార్టు కంటే రెండో పార్ట్ మరింత భయంకరంగా ఉంటుందని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు తెలిపారు.అయితే, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పొలిమేర సినిమాను ఫ్రాంచైజీలుగా ముందుకు తీసుకెళ్దామని మేకర్స్ భావిస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించి డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ పది రెట్లు థ్రిల్ ఇస్తుందని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెలిపారు. అంతేకాకుండా మూడో పార్టుకు కథ రాయడం కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.” రెండవ భాగంలో లూప్ హోల్స్, బ్లాక్స్ వదిలాను. వాటిని సరిచేసుకుంటూ మూడో పార్టును కూడా రెడీ చేస్తాను” అని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అయితే, మూడో పార్ట్ మరింత పెద్ద స్థాయిలో ఉంటుందని, అందులో స్టార్ హీరోలను కూడా యాడ్ చేస్తానని డైరెక్టర్ చెప్పినట్లుగా తెలుస్తుంది.