ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది. ఇప్పుడు స్కంద మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..స్కంద చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది . స్కంద మూవీ నవంబర్ 2వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‍స్టార్ నేడు (అక్టోబర్ 27) అధికారికంగా ప్రకటించింది. “యాక్షన్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లేందుకు స్కంద వచ్చేస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి ర్యాపో ర్యాంపేజ్ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డిస్నీ+హాట్‍స్టార్.స్కంద సినిమా అక్టోబర్ 27న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుందని ముందుగానే సమాచారం వచ్చింది. అయితే, ఆ ప్లాట్‍ఫామ్ మాత్రం నవంబర్ 2వ తేదీన స్కంద చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు తెలిపింది.
స్కంద సినిమాలో రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను తన స్టైల్‍లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీని తెరకెక్కించిన విధానంపై మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఆశించిన స్థాయిలో థియేటర్లలో కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది . భారీ అంచనాలతో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులని నిరాశపరిచింది.స్కంద సినిమాలో రామ్ పోతినేని సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. రామ్, శ్రీలీల డ్యాన్సులు ఈ చిత్రంలో అదిరిపోయాయయి. అలాగే సినిమాలో సాయి మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా మరియు ప్రిన్స్ సెసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా స్కంద సినిమాను గ్రాండ్ గా నిర్మించాయి.