CINEMA

వారు నన్ను చంపేస్తామంటూ బెదిరించారు – సన్నీ లియోన్

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ (Sunny Leone)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.. అయితే ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆమె తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సవాళ్ల గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది.. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం కెన్నెడీ.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే కేన్స్ కు వెళ్లిన సన్నీలియోన్.. అక్కడ తన సినిమా బృందంతో కలిసి సరదాగా సమయాన్ని గడిపి ఆ తర్వాత ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది..

ఇకపోతే సన్నిలియోన్ మీడియాతో మాట్లాడుతూ.. అటు బాలీవుడ్ లో తన కెరియర్ ఎలా మొదలైందో కూడా ఆమె తెలియజేసింది.. సన్నీలియోన్ మాట్లాడుతూ.. మొదట్లో నేను కూడా అడల్ట్ సినిమాలలో నటించడం వల్ల సమాజంలో నాపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది..ఎంతోమంది నన్ను చూసి అసహ్యించుకున్నారు కూడా.. అయితే ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను.. సినిమాను సినిమాలాగే ఎందుకు చూడలేకపోతున్నారు అని చింతించాను.. ఇక అప్పుడే నాకు బిగ్ బాస్ రియాల్టీ షో కోసం బాలీవుడ్ తరఫున భారత్ నుంచి అవకాశం లభించింది.

అప్పుడు కూడా దాదాపు కొన్ని నెలలు ఆలోచించిన తర్వాత నేను బాలీవుడ్ కి రావాలని నిర్ణయించుకున్నప్పుడు బెదిరింపులు ఎక్కువయ్యాయి.. బాంబు పెట్టి చంపేస్తామని మెయిల్స్ కూడా చేశారు.. ఇక ఆ బెదిరింపులను నేను తట్టుకోలేకపోయాను మరొకవైపు ఆ బెదిరింపులు బిగ్ బాస్ షోను ప్రజెంట్ చేసే సంస్థకు కూడా వెళ్లాయి.. ఆ సంస్థకు సంబంధించిన ఒక ప్రధాన వ్యక్తి కూడా అప్పట్లో జాబ్ కి రిజైన్ చేయడం జరిగింది. ఇక అలా భయపడుతూనే ఇండియాకి వచ్చి బిగ్ బాస్ షోలో పాల్గొన్నాను.

కానీ ఆ షో నా జీవితాన్నే మార్చేస్తుందని అనుకోలేదు.. ఇక భారత ప్రజలకు నేను దగ్గరయ్యాను.. మొదట్లో ఇక్కడ కూడా కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను.. ప్రస్తుతం అక్కడివారు నన్ను బాగా ఆదరిస్తున్నారు అంటూ సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.