CINEMA

14 ఏళ్లకే అలాంటి పని చేసి పోలీసులకు దొరికిపోయిన మహేష్‌.. లీకైన టాప్ సీక్రెట్‌!

మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో నటించాడు. బాల నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. `రాజకుమారుడు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.

ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈ స్టార్డమ్‌ ఆయనకు అంత సులభంగా ఏమీ రాలేదు. సూపర్ స్టార్ తనయుడైన మహేష్‌.. సూపర్ స్టార్ అనిపించుకునేందుకు ఎంతగానో కష్టపడ్డాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా సత్తా చాటుతున్నాడు. సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబుకు సంబంధించి తాజాగా ఓ టాప్‌ సీక్రెట్ ను కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు(Ghattamaneni Adiseshagiri Rao) లీక్ చేశారు.

మే 31న కృష్ణ నటించిన `మోసగాళ్లు` సినిమా రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆదిశేషగిరిరావు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. మహేశ బాబు(Mahesh Babu)ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అతడు పెద్ద స్టార్ అవుతాడని నేను ఎప్పుడో ఊహించాను. ఇప్పుడు అదే జరిగింది. అతడు గొప్ప నటుడే కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఎవ్వరినైనా సరే ఇట్టే ఇమిటేట్ చేసేస్తాడు. చాలా మంది ఈ విషయం తెలియదు.

ఇక 14 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడుపుతూ మద్రాసు పోలీసులకు(Police) కంటపడ్డాడు. దాంతో అతడి కారును పోలీసులు వెంబడించారు. అయినా సరే భయపడకుండా నీరుగా ఆఫీసులోకి ఎంటర్ అయ్యి కార్ పార్క్ చేసి ఏమీ తెలియనట్లు వచ్చి కూర్చున్నాడు. నేనే పోలీసులతో మాట్లాడి పంపించేసాను` అంటూ మహేష్ చిన్నతనంలో చేసిన ఓ తుంటరి పనిని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు బయటపెట్టాడు.