CINEMA

హీరోయిన్ లని మించిపోయిన మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఏమాత్రం షూటింగ్ గ్యాప్ వస్తే ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసేస్తారు.

షూటింగ్ ఫ్యామిలీ మినహా మహేష్ దేనికి కూడా తన సమయాన్ని వృధా చేయరు. ఎక్కువగా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తారు. మహేష్ కొడుకు గౌతమ్ కూతురు సితార ఇద్దరు కూడా ప్రస్తుతం టీనేజ్ వయసులో ఉన్నారు. ఇద్దరిలో సితార చాలా ఎనర్జిటిక్ గా సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తోంది. రకరకాల డ్యాన్సుల వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంది.

Mahesh Babu daughter Sitara Ghattamaneni who has surpassed the heroines
గత ఏడాది మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో పెన్ని సాంగ్ కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టెప్పులు వేయడం జరిగింది. ఇదే సమయంలో అడపాదడపా సింగింగ్ టాలెంట్ కూడా ప్రదర్శిస్తూ వీడియోలు చేస్తూ ఉంది. మొన్న మధ్య డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురుతో ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రకరకాల వీడియోలు కూడా చేయటం జరిగింది. వాటిలో టూరిజం వీడియోలు కూడా చేసింది. తాజాగా సితార తన పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఇటీవల మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లిన దుబాయ్ ట్రిప్ వీడియో షేర్ చేసింది.