CINEMA

బన్నీ- బోయపాటి.. ఏదో జరుగుతోంది!

అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు ఫుల్ మాస్ మిల్స్ లాంటి సూపర్ హిట్టు అందుకొంది. ఈ సినిమాతో బన్నీ మాస్‌కి మరింతగా దగ్గరయ్యాడు.

అప్పటికి.. బన్నీ కెరీర్ లో అదే బిగ్గెస్ట్ హిట్‌. ఆ తరవాత బన్నీతో మరో సినిమా చేయాలని బోయపాటి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు.

బన్నీ కూడా బోయపాటితో మరోసారి పనిచేయాలని ఎప్పుడో ఫిక్సయ్యాడు. తనకీ టైమ్ దొరకలేదు. అయితే ఇప్పుడు బన్నీ – బోయపాటి మధ్య కొత్త సినిమాకి సంబంధించిన డిస్కర్షన్స్ మొదలయ్యాయని టాక్‌. బన్నీని నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బోయపాటి బన్నీతో ములాఖత్ అయ్యారు.

వీరిద్దరి మధ్య కొత్త సినిమాకి సంబంధించిన చర్చలు జరిగాయని టాక్‌. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వీరిద్దరూ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 ముగిసిన వెంటనే.. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తాడు బన్నీ.

ఆ తరవాత అట్లీ లాంటి వాళ్లు లైన్ లో ఉన్నారు. పుష్ప 2 కీ, త్రివిక్రమ్ సినిమాకీ మధ్యలో ఏమాత్రం గ్యాప్ ఉన్నా, బోయపాటి లైన్లోకి వచ్చేస్తాడు. లేదంటే. ప్రస్తుతానికి బన్నీ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయ్యాకే.

బోయపాటి సినిమా ఉంటుంది. ఎలాగైతేనేం.. సరైనోడు 2 రాబోతోంది. ఇది మాత్రం పక్కా.