CINEMA

బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు

భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్.. అసలు విషయాలను దాట వేశారు. బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు రాశారు కానీ..

రాజకీయంగా కీలకమైన జమిలీ ఎన్నికలు, యూసీసీ , భారత్ పేరు మార్పు అంశాలపై తమ పార్టీ విధానం ఏమిటో మాత్రం ఎంపీలకు చెప్పలేదు.

పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయవేగు, ఇటీవల మారిన రాజకీయ పరిణామాల రీత్యా కమలానికి గులాబీ దగ్గరవుతోంది. మేం తటస్థం అని ఎంత చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాకు కాకుండా భారత్‌కే జై కొడతారనే వాదనలు బలంగా వినబడుతున్నాయి. అయితే ఇది మరింత సమస్య అయ్యే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ భారత్‌కు జై కొడితే. బీజేపీకి అది మరింత సాగిలబడిందనే సంకేతాలు వెలువడతాయి.

జమిలీ ఎన్నికలొస్తాయనే వార్తలు, ఊహాగానాలతో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం మూణ్నెల్ల ముందే తొందరపడి తొలి జాబితాను ప్రకటించటంతో బీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలకు కేంద్రం పచ్చజెండా ఊపితే. కొత్త సమస్యలు వస్తాయి. దీనిపై ఎలా స్పందించాలో కేసీఆర్ నిర్ణయించుకోలేకపోయారు.

పార్లమెంట్ లో ఏ బిల్లులు పెడతారో తెలియదు కాబట్టి. తొందర ఎందుకని వేచి చూద్దామని కేసీఆర్ అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.