CINEMA

దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..

టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే.

ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గతేడాది రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ ఆశిష్ కు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తరువాత ఆశిష్.. సెల్ఫిష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కసి విశాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

ఇక ఆశిష్ తాతగారు.. దిల్ రాజు, శిరీష్ నాన్నగారు మృతి చెందిన విషయం తెల్సిందే. విషాదం జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరిపితే మంచి జరుగుతుందని.. ఆశిష్ పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు భావిస్తున్నారని టాక్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక వ్యాపారస్తుల కుటుంబంలోని అమ్మాయిని ఆశిష్ కు చూశారట. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు కుటుంబం.. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనుంది సమాచారం. మొదట ఎంగేజ్ మెంట్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న పెళ్లి పెట్టుకోనున్నారట. ఈ పెళ్లిని జైపూర్ లో చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి సెల్ఫిష్ సినిమాతో ఆశిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.