సంక్రాంతి.. సంక్రాంతి.. సంక్రాంతి.. ప్రస్తుతం సినీ ప్రేక్షకుల అందరి చూపు సంక్రాంతిమీదనే ఉంది. ఒకటా.. రెండా.. దాదాపు పెద్ద సినిమాలు అన్ని సంక్రాంతికే ఉన్నాయి.
వీటితో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా యాడ్ అవ్వడంతో ఈ సంక్రాంతి మరింత రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, సైంధవ్, హనుమాన్ తో పాటు ఈగల్ కూడా రావడానికి ప్రయత్నిస్తోంది. ఇవన్నీ ఇలా ఒకేసారి రావడానికి కారణం.. సలార్ డిసెంబర్ లో రావడమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంకో స్టార్ సినిమా కు వస్తుంది అనుకున్నారు. అదే తంగలాన్. చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా సంక్రాంతికే వస్తుంది అనుకున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా విక్రమ్ ఈ సినిమా కోసం పడిన కష్టం మాములు విషయం కాదు. ఆ లుక్ చూస్తే ఎవరైనా భయపడడం ఖాయమే అని చెప్పొచ్చు. ఇక సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఉండడంతో విక్రమ్ కొద్దిగా ముందుకు వెళ్ళాడు. రిపబ్లిక్ డే రోజున తంగలాన్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజం చెప్పాలంటే.. విక్రమ్ ఈ రిలీజ్ డేట్ ను ఎంచుకొని మంచి పనే చేశాడు అని చెప్పాలి. ఆ రోజున తంగలాన్ తో పోటీపడే సినిమాలు లేవు కాబట్టి.. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇక నవంబర్ 1 న టీజర్ రిలీజ్ తో సినిమాపై మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదిఏమైనా అదును చూసే విక్రమ్ సినిమాను దింపుతున్నాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి .