అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ఎట్టేకలను తన ప్రేమను దక్కించుకోబోతుంది. త్వరలోనే మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే.
ఈ మధ్యనే వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిపించారు కుటుంబ సభ్యులు. ఇక బీరు పెళ్లి మాత్రం ఇటలీలో జరగనుంది. ఈ పెళ్లి పనులన్నీ వరుణ్ పెద్దన్న రామ్ చరణ్ – వదిన ఉపాసన చేతుల మీద జరుగుతున్నాయి. నవంబర్ 1 న ఈ పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే చరణ్ – ఉపాసన ఇటలీ చేరుకొని పెళ్లి పనులు పూర్తిచేస్తున్నారు. ఇక తాజాగా కాబోయే జంట ఇటలీకి పయనమయ్యింది.
నేడు ఎయిర్ పోర్ట్ లో వరుణ్, లావణ్య సందడి చేశారు. ఇక ముఖ్యంగా లావణ్య డ్రెసింగ్ స్టైల్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. మొదటి నుంచి కూడా లావణ్య.. అంత అల్ట్రా స్టైలింగ్ లో కనిపించింది లేదు. గ్లామర్ పాత్రలు చేసినా.. అందుకు తగ్గ డ్రెస్సింగ్ లోనే కనిపించేది తప్ప.. బయట ఈవెంట్స్ లో కానీ, ఎయిర్ పోర్ట్ లో స్టైలిష్ గా కనిపించేది. ఇక వరుణ్ తో నిశ్చితార్థం అయ్యాక.. లావణ్య ట్రెడిషినల్ లుక్ లో కి మారిపోయింది. అంటే.. కొత్త పెళ్లి కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నదో ఏమో కానీ.. లావణ్య పూర్తిగా ట్రెడిషనల్ వేర్ లో కనిపిస్తుంది. ఇక ఎయిర్ పోర్ట్ లుక్ లో కూడా ఆమె చాలా పద్దతిగా కనిపించింది. ఫుల్ లాంగ్ క్రాప్ టాప్ పై అదే కలర్ షాల్ వేసుకొని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నవంబర్ 5 న హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.