కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్భాన్ని బుట్టబొమ్మ పూజా హెగ్డే తీసుకొచ్చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రధానంగా ఈ వార్త బాలీవుడ్ ను అయితే షేక్ చేస్తోంది. హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో కొడుకును పూజా పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకున్నట్లు సమాచారం.
Advertisement
పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపో, ఎల్లుండో పూజా దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి చివరలో వివాహం జరిగే అవకాశం ఉంది. డిసెంబరు ఆఖరు వారంలో నిశ్చితార్థం, మార్చిలో వివాహం చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ దీపావళిని ఆమె చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారంటున్నారు. బుట్టబొమ్మను మనువాడబోయే స్టార్ హీరో కొడుకు ఎవరా? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అభిమానుల కోసం ఆ తీపివార్తను బుట్టబొమ్మ ఎప్పుడు ప్రకటిస్తుందా? అని పరిశ్రమ కూడా ఎదురుచూస్తోంది.
మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేకు ప్రస్తుతం కాలం కలిసిరావడంలేదు. వరుసగా ఫ్లాప్స్ పలకరించడంతో కొత్తగా అవకాశాలు రావడంలేదు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ పరాజయం పాలయ్యాయి. గుంటూరు కారం సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ కాల్షీట్లు అడ్జస్ట్ కాక తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో శ్రీలీల ప్రధాన హీరోయిన్ గా మారింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా ఎంపికైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.