Uncategorized

ఆటో కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్: కరీంనగర్ పిల్లతోనే పెళ్లి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కోసం అయ్యే ఖర్చును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

 

Advertisement

ఈ సందర్భంగా ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు వజ్రాయుధం లాంటిదని ఉపయోగించే ముందే ఆలోచించి మంచి అభ్యర్థిని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

 

‘ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్‌ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్‌ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు’ అని కేసీఆర్ వెల్లడించారు.

 

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావ