CINEMA

బాలయ్య నన్ను రూమ్ కి రమ్మన్నాడు… తాగొచ్చి అర్థరాత్రి డోర్ కొట్టాడు, హీరోయిన్ కీలక ఆరోపణలు..

సీనియర్ నటి విచిత్ర చేసిన కామెంట్స్ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. బిగ్ బాస్ తమిళ్ 7 వేదికగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. హీరో బాలయ్య సెట్స్ లో తనను వేధించినట్లు వెల్లడించింది. 2001లో మేము కేరళ వెళ్ళాము. అక్కడ మాకు 3 స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. అక్కడ పార్టీ ఏర్పాటు చేశారు. అప్పుడే తెలుగు స్టార్ హీరోతో నాకు పరిచయం అయ్యింది. ఆయన నా పేరు కూడా అడగలేదు. నేను ఎవరో కూడా తెలియదు. రాత్రి నా రూమ్ కి వచ్చేయ్ అన్నాడు.

 

More

From Tollywood

నేను వెళ్ళలేదు. నెక్స్ట్ డే నుండి షూటింగ్ లో సమస్యలు చుట్టుముట్టాయి. తమిళ పరిశ్రమలో నేను ఇలాంటి దారుణ పరిస్థితులు చూడలేదు. ఆ హీరో రోజూ తాగొచ్చి నా రూమ్ డోర్ కొట్టేవాడు. నేను భయపడిపోయే దాన్ని. నా రూమ్ కి ఫోన్స్ రాకుండా చేయాలని హోటల్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేశాను. మేనేజర్ నాకెంతో సహకారం అందించారు. నేను ఉండే రూమ్ నంబర్స్ యూనిట్ కి తెలియకుండా మార్చేవాళ్ళు.

 

నేను పాత గదిలోనే ఉన్నాను అని ఆ రూమ్ డోర్ కొడుతూ ఉండేవాళ్ళు. ఆ హీరో నాకు గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు.నెక్స్ట్ డే అడవిలో షూటింగ్ జరుగుతుండగా ఒకరు అసభ్యంగా తాకాడు. పొరపాటున జరిగిందని అనుకున్నాను. అతడు పదే పదే చేస్తున్నాడు. స్టంట్ మెన్ దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకెళ్లి కంప్లైంట్ చేశాను. రివర్స్ లో నా చెంప చెళ్లుమనిపించాడు.

 

కోపం, బాధ, అసహనం… ఏం చేయాలో తెలియని వేదన. చెంప మీద పడ్డ దెబ్బ చూపిస్తూ యూనియన్ కి ఫిర్యాదు చేశాను. ఈ సంఘటన ఇంతటితో మర్చిపో అన్నారు. ఇలా అవమానాలు ఎదుర్కొంటూ పని చేయాల్సిన అవసరం ఏముందని ఆ హోటల్ మేనేజర్ అన్నారు. తర్వాత ఆయన నాకు భర్త అయ్యారు. ముగ్గురు అందమైన పిల్లలను నాకు ఇచ్చాడు. క్యాస్టింగ్ కౌచ్ వలెనే నేను పరిశ్రమకు దూరం అయ్యాను… అని విచిత్ర అన్నారు.

 

విచిత్ర బాలకృష్ణ పేరు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మ్యూట్ చేశారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం 2001లో ఆమె నటించిన తెలుగు సినిమా ‘భలేవాడివి బాసూ’. ఈ మూవీ షూటింగ్ ప్రధాన భాగం అడవిలో సాగుతుంది. విచిత్ర అడవి తెగ అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సినిమా సెట్స్ లోనే బాలకృష్ణ తనపై వేధింపులు పాల్పడినట్లు ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆమె వీడియో వైరల్ అవుతుండగా సంచలనం రేపుతోంది