CINEMA

సలార్ కు రెండు ప్రభుత్వాల ఓకే.. టికెట్ రేట్లు ఎంత పెంచారంటే

ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందింది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు రెండు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సింగిల్ థియేటర్ లో టికెట్ రేట్ ఎంతవరకు పెంచారు,అలాగే మల్టీప్లెక్స్ లో అయితే ఎంతవరకు పెంచారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

 

తెలంగాణ మల్టీప్లెక్స్ లో అయితే 100 రూపాయల వరకు పెంచారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అయితే 65 రూపాయలు పెంచుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇక ఏపీలో మాత్రం 40 రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న క్రమం లో వాళ్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి తమ యొక్క విజ్ఞప్తిని తెలియజేయగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ల విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేసి వాళ్లకు పెంచుకోవడానికి అనుమతిని అయితే ఇచ్చాయి. అయితే ఈ పెరిగిన రేట్లు తెలంగాణలో అయితే డిసెంబర్ 22 నుంచి 28 వ తేదీ వరకు మాత్రమే అమలులో ఉంటాయి ఆ తర్వాత నుంచి యధావిధిగా టికెట్ రేట్ అనేది కొనసాగుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది.

 

ఇక అదే విధంగా రిలీజ్ కి ముందు రోజు అర్ధరాత్రి ఒంటిగంట నుంచి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్స్ ని ఇచ్చింది. ఇక అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి వారం రోజులపాటు ఎక్స్ ట్రా షోస్ కూడా వేసుకునే వెసులుబాటును కల్పించినట్టుగా తెలుస్తుంది…ఇక ఏపీ గవర్నమెంట్ మాత్రం టికెట్ రేట్ మీద 40 రూపాయలు పెంచింది. ఎక్స్ ట్రా షోస్ కి మాత్రం అనుమతిని ఇవ్వలేదు…