నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2’ సినిమాకు సంబంధించిన ‘తాండవం బ్లాస్టింగ్ రోర్’ వీడియో శుక్రవారం విడుదలై నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ 56 సెకన్ల వీడియోలో బాలకృష్ణ పలికిన “సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో… ఏ సౌండ్‌కు నవ్వుతానో… ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. కొడకా.. ఊహకు కూడా అందదు..” వంటి మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ చిత్రం డిసెంబరు 5న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో బాలకృష్ణ, బోయపాటి కలయికలో విజయం సాధించిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్ మరియు ఎం తేజస్విని నందమూరి సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
‘అఖండ-2’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా వంటి నటీనటులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన బ్లాస్టింగ్ రోర్ వీడియో బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను మరింత పటిష్టం చేస్తూ, డిసెంబర్ 5న రాబోయే చిత్రంపై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచింది.

