CINEMA

: ఓటీటీలో సార్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేశారు. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో విడుదలవ్వడా.. తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ట్రైలర్‌, టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఫిబ్రవరి 17నవిడుదలై మంచి ఆదరణ పొందింది. Photo : Twitter ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లును రాబట్టింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆఫీస్ మొత్తంగా రూ. 13.85 కోట్ల షేర్ ( రూ. 25.96 కోట్ల గ్రాస్) వసూలు చేసి వావ్ అనిపించింది. తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, రైటర్ పద్మభూషణ్ తర్వాత ఐదో క్లీన్‌ హిట్‌గా ‘సార్’ నిలిచింది. ఈ సినిమా రూ. 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా రూ. 6 కోట్లను రాబట్టాలి. ఓవరాల్‌గా తెలుగులో ఇపుడు రూ. 8.33 కోట్ల లాభాలను తీసుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. Photo : Twitter ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. సార్ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళం భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దాదాపుగా 20 కోట్ల రూపాయలకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమా వచ్చే నెల 22 వ తారీఖున స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అంతేకాదు దాదాపుగా ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది.