తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన డీజే టిల్లు (DJ Tillu) సినిమా కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ (డిజే టిల్లు 2) (Tillu Square) రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ (Siddharth Jonnalagadda) ఈ సినిమా ను ఇటీవలే అనౌన్స్ చేశాడు. యూత్ ను ఈ సినిమా ఎంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా నెలకొంది. అందుకే సిద్దు వెంటనే ఈ సినిమా కు సీక్వెల్ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా ను అనౌన్స్ చేసినప్పుడే అందరిని ఎట్రాక్ట్ చేసిన ఓ విషయం ఏంటంటే ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) కావడం. ప్రేక్షకులలో మంచి గుర్తింపు, ఫేమ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఉంటె ఎలాంటి సినిమా ను అయినా చూడడానికి ఇష్టపడతారు. అలా ఈ సినిమా కి ఆమె హీరోయిన్ అయితే బాగుంటుందని డీజే టిల్లు బృందం అనుకుంది.
అనుకున్నదే తడవుగా ఆమెను ఎంపిక చేసుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు. ఇక అంతా సాఫీగా సాగుతుందని అనుకుంటున్నా సమయంలో ఆమె ఈ సినిమా లో నటించడం లేదు అనే వార్త ఈ సినిమా అభిమానులను కలిచి వేస్తుంది. దాదాపుగా ఇదే నిజం అని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే కారణం ఏంటో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రెమ్యునరేషన్ (Remuneration) కారణంగా అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుందని చెబుతున్నారు. ఇంకా కొంతమంది ఇందులో మితిమీరిన ఎక్స్ పోజ్ తో పాటు ఎక్కువ లిప్ లాక్ సీన్స్ ఉన్న కారణంగా అది చేయడానికి ఇష్టపడని అనుపమ ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. ఇప్పటిదాకా తెలుగు లో ఆమె చేసిన సినిమాలలో ఎక్కువగా గ్లామర్ (Glamour) ను ప్రదర్శించింది లేదు. ఒకటి రెండు సినిమాలో చేసిన పెద్దగా ఎం చేయలేదు. ఈ సినిమా అది ఎక్కువ కారణంగా ఆమె డ్రాప్ అయ్యిందట. దీనిపట్ల చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.