Health

జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ…దానిలో ఉన్న పోషక విలువల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో సి విటమిన్ ఉంటుంది. జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. జామకాయను పేదవాని ఆపిల్ అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు…ఆపిల్ కు సమానం ఉంటాయి. అయితే కేవలం జామకాయనే కాదు జామ ఆకుల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

1. రెండు జామ ఆకులను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గ్లాసు నీటిలో వేసి బాగా మరగించాలి. మరిగాక ఆ నీటిని వడగట్టి ప్రతిరోజూ ఉదయం తాగినట్లయితే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. అంతేకాదు షుగర్ వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ..విటమిన్స్, శరీరంలోని టాక్సీన్స్ ను బయటకు పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

2. జామ ఆకుల్లో పొటాషియం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాదు రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్న వారికి జామ ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్న చోట జామఆకులను వేడి చేసి కట్టినట్లయితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.

3. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు జామ ఆకులను వేడి చేసి ఒక గుడ్డలో కట్టి నొప్పిఉన్న ప్రాంతంలో కట్టండి. ఇలా రాత్రంతా ఉంచండి. మరసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది. అయితే సమస్య మరింత తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

4. జామఆకుల కషాయాన్ని ప్రతిరోజూ వ్యాయామం చేసిన తర్వాత తాగితే ఎన్నో ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.