ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 (Jagan Effect) కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను భయపెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 8న కర్నూలు పర్యటనకు రావాల్సిన ఆయన వెనక్కు తగ్గారు. రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేకపోవడంతో అమిత్ షా సైతం ఢిల్లీకి పరిమితం అయ్యారు.
కానీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు(CBN) ఏ మాత్రం వెనక్కు తగ్గడంలేదు. జీవో నెం 1 ద్వారా అనధికార ఎమర్జెన్సీ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి (Jagan Effect) మీద తిరగబడ్డారు. మూడు రోజుల కుప్పం పర్యటన కొనసాగిస్తున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి పాదయాత్ర చేస్తూ చీకటి జీవో మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు.