National

భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ‘డ్యామ్​’!

భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్​​ సరిహద్దుల్లో ఓ డ్యామ్​ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్​.. ఎందుకు- ఎక్కడ? టిబెట్​లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్​తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్​కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్​లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది ఇండియాలోని గంగా నదిలో చేరిపోతుందికాగా.. ఈ ట్రై జంక్షన్​కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా ఓ డ్యామ్​ను నిర్మిస్తోందని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను.. ఇంటెల్​ ల్యాబ్​కు చెందిన జియోస్పాటియల్​ ఇంటెలిజెన్స్​ రీసెర్చర్​ డామియన్​ సిమాన్​ విడుదల చేశారు. 2021 మే నుంచి ఈ డ్యామ్​కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. డ్యామ్​తో నది కదలికలను నియంత్రించేందుకు చైనా భావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. డ్యామ్​ పొడవు 350ఎంఎం- 400ఎంఎం మధ్యలో ఉండొచ్చు. “ప్రస్తుతం ఈ డ్యామ్​ నిర్మాణ దశలోనే ఉంది. మరి దీనిని చైనా ఎలా ఉపయోగిస్తుందనేది స్పష్టంగా తెలియదు. ఈ డ్యామ్​కు సమీపంలో ఓ ఎయిర్​పోర్ట్​ను కూడా చైనా కడుతోంది!” అని డామియన్​ సిమాన్​ తెలిపారు.