National

అంతంటారు.. ఇంతంటారు.. కానీ ఇంటిపేరు మాత్రం వద్దంటారు’

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ రాజ్యసభలో విపక్ష కాంగ్రెస్ పై చురుక్కులు, చమక్కులతో విరుచుకుపడ్డారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇంటిపేరైన నెహ్రూ (Nehru surname) ఆయన తరువాత తరాలు ఉపయోగించకపోవడంపై విమర్శలు గుప్పించారు. నెహ్రూ (Jawahar lal Nehru) పేరును దాదాపు 600 ప్రభుత్వ పథకాలకు పెట్టారని, తమ ప్రభుత్వం నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ఏ పథకానికైనా పెట్టకపోతే, రచ్చ చేస్తారని ప్రధాని మోదీ విమర్శించారు. కానీ ఇంటిపేరుగా నెహ్రూ (Nehru surname) ను ఉపయోగించరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawahar lal Nehru) ముత్తాత అవుతారన్న విషయం తెలిసిందే. రాహుల్ (Rahaul Gandhi), ప్రియాంక (Priyanka Gandhi) ల నానమ్మ ఇందిరా గాంధీ తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. PM Modi criticises Gandhi’s for not using Nehru surname: కానీ ఇంటిపేరు మాత్రం వాడుకోరు వందల సంఖ్యలో ప్రభుత్వ పథకాలకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawahar lal Nehru) పేరును కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టాయని, కానీ, ఆయన ఇంటిపేరైన ‘నెహ్రూ’ ను మాత్రం తమ ఇంటిపేరుగా (Nehru surname) ఉపయోగించరని ప్రధాని మోదీ విమర్శించారు. సొంత తాత అయిన నెహ్రూ ఇంటి పేరు (Nehru surname) ఉపయోగించడానికి వారెందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ అధిష్టానంలో భాగమైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఒక న్యూస్ రిపోర్ట్ ను ఉటంకిస్తూ, ‘నెహ్రూ (Jawahar lal Nehru) పేరును ప్రభుత్వ పథకాలకు ఉపయోగించకపోతే కాంగ్రెస్ గందరగోళం సృష్టింస్తుంది. ఉద్యమాలు చేస్తుంది. కానీ వారి అగ్ర నేతలు తమ తాతగారైన నెహ్రూ (Jawahar lal Nehru) ఇంటిపేరును ఉపయోగించడానికి మాత్రం భయపడ్తారు. తమ ఇంటిపేరు నెహ్రూ (Nehru surname) అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గు? ” అని ప్రధాని మోదీ సోనియా గాంధీ కుటుంబంపై వ్యంగ్య ప్రశ్నలు చేశారు.