National

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల పరీక్ష తేదీల్లో మార్పులు

2023 పరీక్ష తేదీలను మార్చారు. పూర్తి వివరాలకు, అలాగే, రివైజ్డ్ డేట్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను కేవీఎస్ అధికారిక వెబ్సైట్ kvsangathan.nic.in. లో చూడవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ 15 (Advt 15), అడ్వర్టైజ్ మెంట్ 16 (Advt 16) ల్లోని ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన పరీక్ష తేదీలను మార్చి, ఆయా పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చిందని కేవీఎస్ ప్రకటించింది. KVS CBT Exam 2023: ఇవే రివైజ్డ్ డేట్స్.. కొత్త రివైజ్డ్ పరీక్ష తేదీలతో ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం.. అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కోసం ఫిబ్రవరి 12నుంచి ఫిబ్రవరి 14 వరకు టీజీటీ (TGT), ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 20 వరకు పీజీటీ (PGT), ఫిబ్రవరి 20న హిందీ ట్రాన్స్ లేటర్ (Hindi Translator), ఫిబ్రవరి 21న ప్రైమరీ టీచర్ (Primary Teacher) ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే, ఫిబ్రవరి 22న ప్రైమరీ టీచర్ (Primary Teacher), అసిస్టెంట్ ఇంజినీర్ (Asstt Engineer) ఉద్యోగాలకు, ఫిబ్రవరి 23న పీజీటీ (PGT), ఫిబ్రవరి 24, 25, 26, 28 తేదీల్లో ప్రైమరీ టీచర్ (Primary Teacher), మార్చి 1, మార్చి 2, మార్చి 4, మార్చి 5 తేదీల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Jr Secretariat Assistant), మార్చి 5న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II (Stenographer Grade II), మార్చి 6న లైబ్రేరియన్ (Librarian) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహిస్తారు. మార్చి 11న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (Asstt Section Officer), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Senior Secretariat Assistant) పోస్ట్ ల భర్తీకి పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ kvsangathan.nic.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.