టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్. గత రెండు దశాబ్దాల నుండి టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజ్. చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయనతో పని చేస్తారు. ఇండస్ట్రీలో దిల్ రాజ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. దీంతోనే దిల్ రాజ్ కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన తమిళ హీరో విజయ్ తో ‘ వారీసు ‘ అనే సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ను అనుకున్నారు. Dil Raju spents crores of rupees for heroin దిల్ రాజ్ కు కేవలం నిర్మాణ రంగంలోనే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఓ రేంజ్ లో వేల్యూ ఉంది. ఒక మంచి కాంబినేషన్ తో సినిమా ట్రైలర్, టీజర్ బాగున్నాయంటే ఆ చిత్రం రైట్స్ ని కొని విడుదల చేస్తాడు దిల్ రాజ్. అలా తెలుగు సినిమాలతో పాటు బోలెడన్ని డబ్బింగ్ సినిమాలను కూడా కొన్నాడు. వాటిల్లో ఒకటే లవ్ టుడే సినిమా. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారుగా ఏడు కోట్ల రూపాయల దాకా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానా నటించింది. ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. Dil Raju spents crores of rupees for heroin అయితే జనాల వీక్నెస్ క్యాచ్ చేయడంలో దిల్ రాజుకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీంతో ఈ అమ్మాయి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన తదుపరి సినిమాలలో బుక్ చేసుకున్నాడు. కేవలం అడ్వాన్స్ రూపంలోనే ఆమెకు పదికోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చాడట. ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఇచ్చేయాలి అని, అలా నాలుగైదు సినిమాలకు సరిపడా అడ్వాన్స్ ఇచ్చి ఆ హీరోయిన్ లాక్ చేసుకున్నాడు దిల్ రాజ్. అయితే సదరు హీరోయిన్ ను మళ్ళీ తమ సినిమాలోకి తీసుకోవడానికి ఆలోచించే నిర్మాతలు, లవ్ టుడే సినిమా హీరోయిన్ కోసం దిల్ రాజ్ ఈ రేంజ్ లో అడ్వాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్నాడు అని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.