గత రెండు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ముంబై (Mumbai ) వాసులు మెరుగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ IQAir (రియల్ టైమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటర్) ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరంగా ముంబై జనవరి 29- ఫిబ్రవరి 8 మధ్య జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. వారం రోజుల్లోనే ముంబై రెండో స్థానంలో నిలిచింది. జనవరి 29న IQAir ర్యాంకింగ్‌లో ముంబై 10వ స్థానంలో నిలిచింది. తర్వాత ఫిబ్రవరి 2, 8 తేదీల్లో ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి 13న ముంబై గాలి నాణ్యత పరంగా ప్రపంచంలోని మూడవ అత్యంత కలుషితమైన నగరంగా నిలిచింది. భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని కూడా అధిగమించింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 తేదీల మధ్య కాలానికి నమోదైన కాలుష్యం ఆధారంగా ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాను స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ తయారుచేసింది. ఇందుకోసం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి సమాచారం సేకరించినట్లు ఐక్యూ ఎయిర్ తెలిపింది.