National

కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..

కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది.

లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.

2017లో కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది దోషులు ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును మొదటగా లక్నోలని ఏటీఎస్ పోలీస్ స్టేషన్ నమోదు చేయగా.. ఆ తరువాత ఎన్ఐఏకు అప్పగించారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తూ.. ఐఈడీలు తయారు చేసి పరీక్షించారని, ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వీటిని అమర్చి పేల్చడానికి యత్నించినట్లు ఎన్ఐఏ కోర్టులో తెలిపింది. లక్నోలోని దోషుల రహస్య ప్రదేశం నుంచి నోట్ బుక్ స్వాధీనం చేసుకున్నారు అధికారు. వీటిలో బాంబుల తయారీకి సంబంధించి వివారాలు ఉన్నట్లు ఏన్ఐఏ పేర్కొంది.