పార్వతీపురం మన్యం జిల్లా
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, నాయకులను దుయ్యబడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకి,రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుంటే తెలుగుదేశం నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చంద్రబాబునాయుడు అంటూ మండిపడ్డారు.