ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయం సాధించింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకు పరిమితమైంది. దీంతో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(54; 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా ఫిలిఫ్ సాల్ట్ (21) ఫర్వాలేదనిపించాడు.
మిచెల్ మార్ష్(3), రిలీ రొసో(5), అక్షర్ పటేల్(1), మనీశ్ పాండే(0)లు ఘోరంగా విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లు తీయగా, రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో పంజాబ్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
IPL 2023:ఉప్పల్‌లో మరో ఓటమి.. సన్‌రైజర్స్ పై లక్నో విజయం.. హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు..!
అంతకముందు..ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శతక్కొట్టడం(103)తో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఐపీఎల్‌తో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. మిగిలిన వారిలో సామ్ కరన్ (20), సికిందర్ రజా(11 నాటౌట్) రెండు అంకెల స్కోర్ దాటారు. శిఖర్ ధావన్(7), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(5), హర్‌ప్రీత్ బార్(2) లు దారుణంగా విపలం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
SRH vs LSG: అభిషేక్ శర్మ.. ఎంత పని జేస్తివి.. నీ దెబ్బకు హైదరాబాద్ ఓడిపాయె..!