National

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. కస్టమర్లకు షాక్!

ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కొందరికి తీపికబురు అందించింది.

అలాగే ఇంకొంత మందికి ఝలక్ ఇచ్చింది. దీని వల్ల బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి, తీసుకోవాలని భావించే వారిపై ప్రభావం పడనుంది. ఇంకీ బ్యాంక్ (Bank) ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈఎంఐ (EMI) భారం తగ్గనుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా బెనిఫిట్ కలుగనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హోమ్ లోన్స్ సహా ఎంసీఎల్ఆర్ ఆధారంగా పొందిన రుణాలన్నింటిపై కూడా వడ్డీ భారం దిగి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతం నుంచి 8.35 శాతానికి దిగి వచ్చింది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గింది. అంటే రుణ రేటు 15 బేసిస్ పాయింట్లు దిగి వచ్చింది.