National

సొంత రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం: అశ్వి

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.

ఈ ఘటన నేపథ్యంలో- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. #Resign, #Resignation అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్ కింద వేల సంఖ్యలో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. అశ్విని వైష్ణవ్ సొంత రాష్ట్రం కూడా ఒడిశానే కావడం- దీని తీవ్రతను మరింత పెంచినట్టయింది. రైల్వే భద్రతను కేంద్రం పట్టించుకోవట్లేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

కాగా- రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఇద్దరు రైల్వే శాఖ మంత్రులు మాత్రమే తమ పదవులకు రాజీనామా చేశారు. మరో ఇద్దరు రాజీనామా చేసినప్పటికీ అప్పటి ప్రధానమంత్రులు వాటిని ఆమోదించలేదు. 1956లో అప్పటి రైల్వే శాఖ మంత్రి రెండుసార్లు లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు. తొలిసారి రాజీనామాను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆమోదించలేదు.