National

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్. త్వరలోనే వాళ్లకు మళ్లీ జీతం పెరగనుంది. అంటే మళ్లీ డీఏ పెరగనుందన్నమాట.

అవును.. గత మార్చిలోనే వాళ్లకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ డీఏను పెంచబోతున్నారట. డీఏ పెంపు విషయంపై త్వరలోనే అప్ డేట్ రానుంది. వచ్చే నెల జులైలోనే వాళ్లకు డీఏ పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి సంవత్సరానికి రెండు సార్లు డీఏను పెంచాలి. ఇప్పటికే గత మార్చిలో పెరిగింది. ఇప్పుడు జులైలో పెంచబోతున్నారు. 3 నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. 3 నుంచి 4 శాతం డీఏ పెరిగితే ఖచ్చితంగా జీతాలు భారీగా పెరగనున్నాయి.

గత మార్చిలో పెరిగిన డీఏ ప్రకారం చూసుకుంటే జనవరి 1, 2023 నుంచి పెరిగిన జీతాలు అమలులోకి వచ్చాయి. మార్చి 2023 లో డీఏ 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అంటే 4 శాతం డీఏ పెరిగింది. మరో 4 శాతం పెరిగితే.. డీఏ 46 శాతం కానుంది. 46 శాతం డీఏ పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒక్కసారిగా పెరగనున్నాయి.డీఏ, డీఆర్ రెండు పెరిగితే.. 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా డీఏ పెరుగుతుంది.