ఏంటో ఈ మధ్య బీజేపీ జాతీయ నేతలకు ఏపీపై తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ జాతీయ నేతలు ఏపీ మీద తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు.
వరుసగా మీటింగ్ లు పెడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఏకంగా ఏపీని టార్గెట్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టిన విషయం తెలుసు కదా. శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించారు.
తాజగా వైజాగ్ రైల్వే గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టిన అమిత్ షా.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఎక్కు పెట్టారు. ఏపీ ప్రభుత్వం వల్లనే ప్రగతి కనిపించడం లేదంటూ ఆయన ఆరోపణలు చేశారు. అసలు బీజేపీ పార్టీకి ఏపీ మీద ఎంత ప్రేమ లేకపోతే.. నిధులు ఎందుకు ఇస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. రెవెన్యూ లోటు నిధులు, పోలవరం నిధులు వేల కోట్లను ఏపీకి ఇచ్చాం అంటూ తమ గొప్పలు చెప్పుకున్నారు అమిత్ షా.