బెంగళూరు/మంగళూరు/బళ్లారి: కర్ణాటక ప్రభుత్వం కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళల నుంచి విశేషమైన మద్దతు లభించింది.
ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి రైళ్లు, ప్రైవేట్ బస్సుల్లో కాకుండా కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. జూన్ 11వ తేదీ నుండి జూన్ 18వ తేదీ వరకు మంగళూరు డివిజన్ లో మాత్రమే ఎంత మంది మహిళలు ప్రయాణించారు అనే విషయం వెలుగు చూసింది.
కర్ణాటక ప్రభుత్వ కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా మంగళూరు డివిజన్ కేఎస్‌ఆర్‌టీసీలో రెండు జోన్లు అంటే కుందాపూర్, ఉడిపి జోన్‌లు వస్తాయి. ఇలా అన్ని రంగాల్లో శక్తి పథకంలో భాగంగా మహిళలు ఉచితంగా ఊర్లు తిరిగేస్తున్నారు.
ప్రేమికులను రివాల్వర్ తో కాల్చి చంపి శవాలను మొసళ్లకు వేసేసి!
జూన్ 11వ తేదీ ప్రథమార్థంలో ఈ నాలుగు మండలాల్లో 5,454 మంది మహిళలు బస్సులో ప్రయాణించగా, వీరి నుంచి కేసీఆర్‌కు ప్రథమార్థంలో రూ.1,90,155 ఆదాయం వచ్చింది. జూన్ 12వ తేదీ మొత్తం రోజు మంగళూరు డివిజన్‌లో ప్రభుత్వ బస్సుల్లో 30,404 మంది మహిళలు ప్రయాణించగా, కేఎస్ ఆర్ టీసీకీ రూ.12,31,753 ఆదాయం వచ్చింది.