బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
మరికొన్ని రోజులు బెంగళూరులో వానలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బెంగళూరులో వానలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వెయ్యడంతో ఐటీ హబ్ ప్రజలు అలర్ట్ అయ్యారు.
బుధవారం కూడా మేఘావృతమై చల్లని వాతావరణం బెంగళూరులో కనపడింది. అయితే రాత్రి కావడంతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం రెండు గంటలకు పైగా బెంగళూరులో దుమ్ము దులిపేసింది. బుధవారం రాత్రి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అయితే బెంగళూరులో పేర్కొన్నంత వర్షాలు పడలేదని కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు నిర్వహణ కేంద్రం (కెఎస్‌ఎన్‌డిఎంసి) తెలిపింది.