చెన్నై/ తిరువారూరు: తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, విజయాన్ని జాతీయ స్థాయిలో ప్రతిబింబించి కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దింపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.
స్టాలిన్ తిరువారూరులో అన్నారు. తిరువారూరులో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి స్మారక చిహ్నం కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవంలో స్టాలిన్ మాట్లాడారు.
వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి!
మనం ఇప్పుడు చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నామని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎ స్టాలిన్ అన్నారు. అలా చేయడంలో విఫలమైతే 3, 000 నుండి 4, 000 సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళనాడు నాశనం అవుతుందని స్టాలిన్ ఆరోపించారు. బీజేపీని కేంద్రంలో మరోసారి అధికారంలో కొనసాగిస్తే తమిళనాడు, తమిళులు, భారతదేశ భవిష్యత్తుకు హానికరంగా మారు తుందని తమిళనాడు సీఎం ఎంకే, స్టాలిన్ ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా తమిళనాడులో లౌకిక ప్రజాతంత్ర శక్తులు అందరూ ఏకమైనట్లే, జాతీయ స్థాయిలోనూ అదే రకమైన ఐక్య కార్యాచరణ మరియు సమన్వయం ప్రతిరూపం కావాలి. మనం గెలవాలి అంటే ముందు ఐక్యత కావాలి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో బీహార్ ముందుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.