అప్రెంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (Apprentice Development Officer ADO) పోస్ట్ ల భర్తీ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు వెలువడ్డాయి.
ఈ భర్తీ ప్రక్రియలో ఫైనల్ ఫేజ్ ఇంటర్వ్యూ. ఏడీఓ పోస్ట్ ల భర్తీలో భాగంగా నిర్వహించిన ఈ ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఈ ఫలితాలను ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ licindia.in. లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ ఆధారంగా రిజల్ట్ చూసుకోవచ్చు.
మొత్తం 9394 పోస్ట్ లు
ఈ పరీక్షను ఎల్ఐసీ ఈ సంవత్సరం జనవరి నెలలో నిర్వహించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 9394 పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. అవి ఒకటి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఎల్ఐసీ ఏడీఓ 2023 మెయిన్స్ ఫలితాలను మే 29న ప్రకటించారు.
రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?
ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ licindia.in. ని ఓపెన్ చేయాలి.
కెరియర్ (Career) ట్యాబ్ పై క్లక్ చేయాలి.
‘రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 22-23 (Recruitment of Apprentice Development Officer 22-23)’ లింక్ పై క్లిక్ చేయాలి.
అనంతరం, స్క్రీన్ పై కనిపించే Apprentice Development Officer Interview result 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
నిర్ధారిత బాక్స్ ల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ను, పాస్ వర్డ్ లేదా డేటాఫ్ బర్త్ ను ఎంటర్ చేయాలి.
పీడీఎఫ్ ఫార్మాట్ లో ఫలితాలు కనిపిస్తాయి. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను చెక్ చేసుకోవచ్చు. లేదా ఆ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసి పెట్టుకోవాలి.