National

శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి సురక్షితంగా కూల్చివేత

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెడ్‌ శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. ఒక యూరోపియన్ ఉపగ్రహం ఇంధనం అయిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయేలా తయారు చేయబడింది.

ఏయోలస్ అనే పేరుతో, 1,360 కిలోల కంటే ఎక్కువ బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. ఈ శాటిలైట్‌ కాలపరిమితి ఐదేళ్లు. ఇటీవల ఇంధనంతోపాటు మిషన్‌ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్‌ అయిన ఈ శాటిలైట్‌ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. అయితే నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి తెచ్చి సురక్షితంగా కూల్చివేసే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించలేదు.

Also Read:
Seven Sixes: ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆప్ఘనిస్థాన్ యువ క్రికెటర్

దీని కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్‌ కంట్రోల్‌ నుంచి శాటిలైట్‌ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు. దీంతో ఈ నెల 24న ఆ డెడ్‌ శాటిలైట్‌ 280 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ తర్వాత దాని ఎత్తు 250 కిలోమీటర్లకు తగ్గించారు. అలా క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం నాటికి భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు ఏయోలస్‌ శాటిలైట్ చేరుకుంది. అనంతరం దాని కక్ష్యను మరింతగా మార్పు చేశారు. చివరకు ఆ శాటిలైట్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది.

Also Read:
Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

సాధారణంగా పడే ఉపగ్రహంతో పోలిస్తే ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు తగ్గుతాయని ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా ప్రమాదాలు 42 రెట్లు తగ్గుతాయి. 1360 కిలోల బరువున్న భారత ఉపగ్రహం ఏయోలస్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2018లో ప్రయోగించింది. భూమి, ఇతర గ్రహాల చుట్టూ గాలి వేగాన్ని కొలవడం దీని లక్ష్యం. వాతావరణ సమాచారాన్ని అందించే ముఖ్యమైన గ్రహాలలో ఇది ఒకటి. ఏయోలస్ అంటే ఏమిటంటే.. గ్రీకు పురాణాలలో గాలుల రక్షకుడిని ఏయోలస్ అని పిలుస్తారు. ఈ ఉపగ్రహం గాలి వేగాన్ని కొలిచే పని కాబట్టి, దీనికి ఏయోలస్ అని పేరు పెట్టారు. వాతావరణాన్ని అంచనా వేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.