National

రంగంలోకి సోనియా – తెలంగాణపై సెంటిమెంట్ అస్త్రం..!!

తెలంగాణపై కాంగ్రెస్ నాయకత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఇందు కోసం కొత్త వ్యూహాలను సిద్దం చేస్తోంది.

కాంగ్రెస్ అగ్రనాయకత్వం వరుసగా తెలంగాణ లో బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ సిద్దమైంది. ఇక, సోనియా గాంధీ రంగంలోకి దిగుతున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసారు. మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు.

సోనియాతో సభ..మేనిఫెస్టో:తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఈ సారి ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ లక్ష్యంగా మారింది. పరిస్థితులు తమకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని భావిస్తోంది. ఈ సమయంలోనే ఆకర్షణీయ మేనిఫెస్టోతో పాటుగా సెంటిమెట్ అస్త్రాలను సంధించేందుకు సిద్దమవుతోంది.సెంటిమెంటుతోపాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకు రావడమే కాకుండా ఏకంగా అధినేత్రినే రంగంలోకి దింపాలని భావిస్తోంది. సెప్టెంబరు 17న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది.

సెంటిమెంట్ అస్త్రం:తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ ఆమెతో తెలంగాణ ప్రజలకు పిలుపు ఇప్పించనుంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనూ ఆ సభలోనే ప్రకటించాలని నిర్ణయించింది. అందులో భాగంగా, తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్‌ 17న సోనియా సభను ఏర్పాటు చేసి.. ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటూ ఆమెతో పిలుపును ఇప్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.