National

65 స్థానాలు గెలిస్తే కేంద్రంలో మనదే సర్కార్ అంటున్న కేసీఆర్..

65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్రకు చెందిన కొంత మంది సర్పంచ్, ఉప సర్పుంచులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి మహారాష్ట్రలో చేయాలంటే.. రూ.49 వేల కోట్లు అవుతుందని వివరించారు.

మహారాష్ట్రలో అనేక ప్రముఖ నగరాలు ఉన్నాయన్నారు. ముంబై, నాగ్ పూర్, పుణె వంటి నగరాలకు మంచి పేరుందని.. అయితే ఈ రాష్ట్రంలోని సంపద ఎటు వెళుతుందో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. మహారాష్ట్రలో భారీగా సంబద ఉంది కానీ.. నాయకులకే మనస్సు లేదన్నారు. వదర్భ లోని బుండానా జిల్లాలోని అందరు సర్పంచులు బీఆర్ఎస్ చేరినట్లు కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టవని విమర్శించారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలు భారీగా తగ్గిపోయినట్లు చెప్పుకొచ్చారు.

తెలంగాణలో 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నట్లు చెప్పారు. అన్నదాతలు ఎన్ని హెచ్పీ మోటర్లు పెట్టుకున్నా అడిగేవారు లేరన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ గర్భజలాలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. చెక్ డ్యామ్ లు, మిషన్ కాకతీయతో ఇదంతా సాధ్యమైందన్నారు. నది నీళ్లు అనవసరంగా సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రమే తాగడానికి నీళ్లు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అంబానీ, అదానీ బాగు కోసమే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను గెలిపించాలని పార్టీలో చేరినవారిని కోరారు. మహారాష్ట్రను బీజేపీ, కాంగ్రెస్, శివసేన మార్చలేకపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే మహారాష్ట్రను ప్రపంచం అంబురపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇంటింటికీ నల్లా నీరు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.