National

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి.

హైదరాబాద్ : తెలంగాణ బీజేపి కార్యక్రమాల రూపకల్పనలో వేగం పెంచింది. అన్ని రంగాల్లో పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీడియా, సోషల్ మీడియా వర్క్ షాప్ కొనసాగుతోంది. వర్క్ షాప్ లో బీజేపీ శ్రేణులకు ఎంపి, బీజేపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్, బీజేపి జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇర్ఫాన్, మహారాష్ట్ర, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సీతా శాల్ దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేందుకు బీజేపీ కసరత్తు : ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర, జిల్లాల అధికార ప్రతినిదులు, జిల్లాల మీడియా ఇంచార్జ్ లు సోషల్ మీడియా వారియర్స్ హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మీడియా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేందుకు కసరత్తు ప్రారంభించింది బీజేపీ. ఈ వర్క్ షాప్ లో తొమ్మిదేళ్ల బీఆరెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు, నెరవేర్చని హామిలపై ప్రజలను చైతన్య పరిచేందుకు బీజేపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు బీజేపీ పై కాంగ్రెస్, బీఆరెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేసేందుకు బీజేపీ నాయకత్వం తమ సైన్యాన్ని మరింత యాక్టీవ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.

ప్రకాష్ జావదేకర్ సలహాలు : ఈ కార్యక్రమంలో మీడియా సోషల్ మీడియా లో అనుభవం ఉన్న రాష్ట్ర, జాతీయ, స్థాయి పార్టీ నేతలతో బీజేపీ అధికార ప్రతినిధులకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ కు ఒరియంటేషన్ క్లాసెస్ లో బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఏ విదంగా తిప్పికొట్టలనే దానిపై వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.