కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది.
సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించింది.
అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో !
ఈ పిటిషన్‌ను సెప్టెంబర్ 1న జాబితా చేయాలని ఆగస్టు 25న కోర్టు ఆదేశించినప్పటికీ విచారణ జరగలేదని తమిళనాడు ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ఈ పిటిషన్‌ను సోమవారం లిస్ట్ చేయాలని కోర్టును న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల పంపిణీకి సంబంధించిన అంశం అని గుర్తు చేశారు.
కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటి విడుదలను 15,000 క్యూసెక్కుల నుంచి 10, 000 క్యూసెక్కులకు, ఆపై 5, 000 క్యూసెక్కులకు తగ్గించడంతో తమిళనాడు రాష్ట్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నెల రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వానికి నిటీని విడుదల చెయ్యాలని చెప్పింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు, డేట్, టైమ్ ఇదే, పక్కా సమాచారం !
ఆగస్టు 12 నుంచి ఆగస్టు 26 మధ్య తమిళనాడుకు 10, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటిస్తున్నదని సీడబ్ల్యూఎంఏ అఫిడవిట్‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆగస్టు 29 నుంచి వచ్చే 15 రోజుల పాటు 5 వేల క్యూసెక్కుల విడుదలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదుల సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈ అంశాన్ని సెప్టెంబర్ 6వ తేదీ బుధవారం విచారణ చెయ్యడానికి అంగీకరించింది. మొత్తం మీద మరోసారి కావేరి నీటి కోసం తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సు