National

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సహజీవనాలు వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.

సహజీవనం నుంచి బయటికి వచ్చిన తర్వాత వివాహానికి భాగస్వామిని కనుగొనడం మహిళలకు చాలా కష్టమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవ భావన ఆరోగ్యకరమైన సమాజానికి లక్షణం కాదని హైకోర్టు పేర్కొంది.

“భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి క్రమబద్ధమైన రూపకల్పన ఉంది. ప్రతి సీజన్లో భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి ఇది మంచిది కాదు” అని జస్టిస్ సిద్ధార్థ్ బెంచ్ స్పష్టం చేశారు. “అలాంటి సంబంధం నుంచి బయటికి వచ్చిన స్త్రీని వారు సాధారణ జీవిగా పరిగణిస్తారా. ఏ కుటుంబమూ అలాంటి స్త్రీని తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించదు” అని కోర్టు పేర్కొంది. “సామాజిక దుష్ప్రవర్తన వల్ల కలిగే అసహ్యం కారణంగా లివ్-ఇన్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుని మరణించిన అనేక కేసులు ఉన్నాయి ” అని చెప్పింది.

“పెళ్లి అనేది సామాజిక భద్రత, స్థిరత్వం అందిస్తుంది. సహజీవన సంబంధాలు ఇలాంటి భద్రతను కల్పించవు. వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలు సమాజాన్ని పక్కదారి పట్టిస్తాయి. చాలా మంది యువతి ఇలాంటి వాటికి అవాటు పడుతున్నారు. సహజీవన వ్యవస్థతో దీర్ఘకాలంలో వచ్చే సమస్యలపై ఎవవరికి అవగాహన లేదు” ఆలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఉత్తర ప్రదేశ్ లోని నహరాన్ పూర్ కు చెందిన ఓ 19 ఏళ్ల యువతితో ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. సదరు వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనను గర్భవతిని చేశడాని యువతి ఆరోపించింది. ఆ వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు కూడా చేసింది. పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టింది. అయితే ఆ వ్యక్తికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. “ఈ దేశంలో వివాహ వ్యవస్థ వాడుకలో లేని తర్వాత మాత్రమే లివ్-ఇన్ సంబంధం సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు అని పిలవబడే అనేక దేశాలలో వివాహ వ్యవస్థను రక్షించడం వారికి పెద్ద సమస్యగా మారింది” అని జస్టిస్ సిద్ధార్థ్ అన్నారు.